కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసిన MLA పాల్వాయి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసిన MLA పాల్వాయి

ASF: ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలు వారితో చర్చించడం జరిగిందన్నారు. అనంతరం ఆరె సంఘం నాయకులతో కలిసి ఆరె కులస్తులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు.