హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ
BPT: 'శిరోరక్ష ప్రాణరక్ష' కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా, రేపల్లె పట్టణంలోని ప్రధాన రహదారులలో 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.