ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కోచింగ్

ADB: పాలిసెట్-2025 పరీక్ష కోసం విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఈ నెల 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 10th పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.