కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రేటర్ HYDలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నగరంలో వీధి లైట్లు కూడా వెలగడం లేదని ఆరోపించారు. సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.