CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నేతలు
కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయంలో CMRF చెక్కులను శనివారం పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 మంది బాధితులకు మంజూరైన రూ.6,95,000 CMRF చెక్కులను NTR స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ నేత వెనిగండ్ల రామకృష్ణ బాధిత కుటుంబాలకు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రాముకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.