అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష

అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష

AP: ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందామని అన్నారు. అమూల్యమైన సంపదను భావి తరాలకు అందించాలని చెప్పారు. YCP ప్రభుత్వ హయాంలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారని ఆరోపించారు. ఎర్ర చందనం ద్వారా వచ్చే ఆదాయం నిర్దేశిత శాతం వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించామని పేర్కొన్నారు.