ఆర్టిజన్లను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం: సీఐటీయూ
SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు జరుగుతున్న ధర్నాలో జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు