న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ పదవి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్‌దానీ(34)కి వరించింది. దీంతో అతిపిన్న వయసులో న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. కాగా, ఆయన భారతీయ సినీ దర్శకురాలు మీరానాయర్, ఉంగాండా జాతీయుడైన మహమూద్ మమ్‌దానీకు జన్మించారు.