బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లా జంగాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది వేధింపులతోనే శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసి శ్రీకాంత్ తన స్నేహితుడికి ఇచ్చాడు. బ్యాంక్ సిబ్బంది నిన్న ఇంటికి వచ్చి డబ్బులు అడగడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.