నగరంలో దోమల బెడద.. ఇబ్బందుల్లో ప్రజలు
HYD: నగర వ్యాప్తంగా దోమల బెడద తీవ్రంగా పెరిగింది. నిల్వ నీరు, కాలువల శుభ్రత లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. వెంటనే ఫాగింగ్, కాలువలు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.