కాట్రేనికోనలో నీటి సంఘాల ఎన్నికల హడావుడి

కోనసీమ: కాట్రేనికోన మండలంలో శనివారం నీటి సంఘాల ఎన్నికల కోలాహలం నెలకొంది. కాట్రేనికోన మండలంలో పల్లంకుర్రు, కందికుప్ప, కాట్రేనికోన, చెయ్యేరు, ఉప్పూడి, దొంతుకుర్రు సంఘాలకు సంబంధించి మండలంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం మూడు గంటల వరకు జరుగుతుంది. రైతులు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు.