గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలి

తుంగతుర్తి: రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలని జెడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల సమన్వయంతో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు