ఈ నెల 10న సాధారణ సర్వసభ్య సమావేశం
CTR: బైరెడ్డిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఆనంద్ బాబు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి అధికారులంతా పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు అంతా ఈ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.