VIDEO: మేడారం జాతర పనులపై మంత్రి సీతక్క ఆదేశాలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి, కల్వర్టుల పనులు వేగవంతం చేయాలని, వైద్య సేవలు, తాగునీరు, క్యూలైన్స్, పార్కింగ్, ఫీడింగ్ రూమ్స్‌ను సమర్థంగా ఏర్పాటు చేయాలని సూచించారు.