కావలిలో దారుణం.. బాలికపై అత్యాచార యత్నం

కావలిలో దారుణం.. బాలికపై అత్యాచార యత్నం

NLR: కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3 ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య (20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీనిని గమనించిన స్థానికులు అడ్డుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.