పొన్నూరులో వ్యక్తి మృతదేహం లభ్యం

GNTR: పొన్నూరు పట్టణంలో రైల్వేస్టేషన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనతో ఆ పరిసరాల్లో ఉన్నవారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజుల క్రితమే మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.