సైనిక దళాలకు సంఘీభావంగా నేడు ర్యాలీ

సైనిక దళాలకు సంఘీభావంగా నేడు ర్యాలీ

KDP: ప్రొద్దుటూరులో భారత సైనిక దళాలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం కాగడాల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి శివాలయం సర్కిల్ వరకు కాగడాలు, కొవ్వొత్తులు, జాతీయ జెండాలతో ఈ ర్యాలీ సాగుతుందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.