కొండమల్లేపల్లిలో 'గాయత్రి జ్ఞాన మహా యజ్ఞం'
NLG: అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాన్ని మార్కెట్ యార్డ్ ఆవరణలో వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రధాన రహదారిపై మహిళలు, భక్తులు భక్తి గీతాలతో భజనలు చేస్తూ.. కలశాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భక్తులకు, మాలాధారణ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.