"మన్యం లీగ్-2026" జిల్లా స్థాయి టోర్నమెంట్
PPM: జియ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బి.పురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల వేదికగా మార్చి 19 నుంచి 21 వరకు "మన్యం లీగ్-2026" జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది మంచి వేదికని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.