బాల్కొండలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NZB: బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈవో బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగం ప్రాధాన్యత, విద్యార్థుల బాధ్యత అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.