జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏఎంసీ ఛైర్మన్

W.G: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడు చేపల రేవులో శ్రీ భక్తాంజనేయ చేపల వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు జరిపారు. ఆకివీడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొల్లా వెంకట్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.