'విజయవాడ బాధితులకు ఆహారం పంపిణీ'

ELR: వరద ప్రవాహంలో మునిగిపోయిన విజయవాడ వాసులకు ఆహారం అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, త్రివేణి గ్లాస్ ఇండస్ట్రీస్, నాగేంద్ర సహకారంతో 9వేల ఆహార పొట్లాలు, 20 వేల వాటర్ బాటిల్స్, 10 వేల వాటర్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేశారు.