నాగులవంచ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్

నాగులవంచ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్

KMM: చింతకాని మండలం నాగులవంచ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నాగులవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రైల్వే స్టేషన్ మూసివేతను నిరసిస్తూ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో పునరాలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.