చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ

చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ

MBNR: మూసాపేట మండలం తునికాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడని, ఆయన గొప్ప పోరాట యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.