తల్లిదండ్రులను విస్మరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

తల్లిదండ్రులను విస్మరిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

SRPT: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించడం వారసుల బాధ్యత అని, వారిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కే. నరసింహ హెచ్చరించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దళారుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు.