దారుణం.. వృద్ధురాలిని కొట్టి బంగారం అపహరణ

దారుణం.. వృద్ధురాలిని కొట్టి బంగారం అపహరణ

KMR: భిక్కనూరు (M) కేంద్రంలో నిన్న రాత్రి దారుణం జరిగింది. గాంధీచౌక్‌లో ఓ అగాంతకుడు లక్ష్మి(70) అనే వృద్ధురాలిని రోకలి బండ, రాయితో మోది 7 తులాల బంగారం అపహరించాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన దుండగుడు, ఇంట్లోకి వెళ్లి ఆమె కిరాతంగా కొట్టి మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు దోచుకెళ్ళాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.