రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB: భీమగల్ పట్టణంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. భీమగల్ పట్టణంలో నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.