'ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి'

ADB: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హెల్త్ సూపర్వైజర్ సుభాష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పర్యటించి ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో డెంగ్యూ నిర్థారణ కావడంతో పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు ఈశ్వర్ రెడ్డి, శ్రీవాణిరాజు, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.