మహిళను క్షేమంగా అప్పగించిన పోలీసులు
VSP: పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి ఓ మహిళ వెళ్లిపోయింది. మహిళపై బుధవారం వచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆమెను గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సమర్థ చర్యపై సీపీ డా. శంఖబ్రత బాగ్చి, అదనపు జిల్లా మేజిస్ట్రేట్, పీ.ఎం.పాలెం పోలీసు సిబ్బందిని అభినందించారు.