జగన్‌పై భానుప్రకాష్ రెడ్డి ఫైర్

జగన్‌పై భానుప్రకాష్ రెడ్డి ఫైర్

AP: మాజీ సీఎం జగన్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వేంకటేశ్వరస్వామి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే పరకామణి చోరీ గురించి ఆయనకు ముందే తెలుసా? అనే సందేహం వస్తుందన్నారు. వైసీపీ హయాంలో టీటీడీ ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లికి పరకామణి చోరీకి సంబంధించిన ముడుపులు అందాయని ఆరోపించారు.