పెళ్లి అయిన 3 రోజులకే హత్య

HYD: రెయిన్ బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నామా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు 3 రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురయ్యాడు.