VIDEO: పండగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో సమావేశం

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి శ్రీ దాడితల్లి అమ్మవారు పండగ ఈ నెల 5- 7 తేదీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, డిఈలతో జాతర ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.