ఆ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు..!

ఆ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు..!

KRNL: క్రిష్ణగిరి పోతుగల్లులో విద్యార్థులతోనే పాఠశాల శుభ్రపరిచే పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, చదవడానికి పంపిన పిల్లలకు స్వీపర్ పనులు అప్పగించడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.