యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TG: కార్తీకమాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట క్షేత్రానికి భక్తులు భారీగా తరలొచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో సందడిగా మారింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.