ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: కవిటి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.