గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

WNP: వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, పాఠశాలలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో వేయాలని ఆయన సూచించారు.