రోడ్డుపై కింగ్ కోబ్రా హల్ చల్

రోడ్డుపై కింగ్ కోబ్రా హల్ చల్

VZM: శృంగవరపుకోట మండల కేంద్రంలో DFC నుంచి రైల్వే స్టేషన్లకు వెళ్లే రహదారిపై శుక్రవారం భారీ కింగ్ కోబ్రా కనిపించి స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ పాము రోడ్డుపై బుసలు కొడుతూ ఉండటంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వచ్చి పామును సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.