మెనూ విధిగా పాటించాలి: కలెక్టర్
WNP: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, ఉపాధ్యాయ హాజరు పట్టికలు, స్టాక్ రూమ్‌లోని నిత్యవసర సరుకులు గడువు తేదీ, భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.