'నేడు అవగాహన సదస్సులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'
KMM: నెలకొండపల్లి మండలం శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సంతోష్ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. మండల పరిధిలోని యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. తద్వారా నేటి యువతకు చక్కటి సందేశాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.