'జిల్లాలో 100% అక్షరాస్యత సాధనకు కృషి చేయాలి'

ASF: జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా 100 శాతం అక్షరాస్యత సాధనపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి అధికారి క్షేత్ర స్థాయిలో కృషి చేయాలన్నారు.