రైతుకు కరెంట్ షాక్.... తీవ్ర గాయాలు

రైతుకు కరెంట్ షాక్.... తీవ్ర గాయాలు

SRPT: మేళ్లచెరువు మండలం జగ్గు తండాకి చెందిన కృష్ణ ఈరోజు ఉదయం తన వ్యవసాయ పొలంలో నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు ద్వారా నీరు అందించేందుకు ప్రయత్నం చేయగా కరెంట్ రాకపోవడంతో విద్యుత్ సరఫరా ఉందో లేదో చెక్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో కిందపడిపోయాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.