ఆదాయంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే టాప్
VSP: ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. మొదటి 7 నెలల్లోనే సుమారు రూ.600 కోట్ల ఆదాయం నమోదైనట్లు సమాచారం. సూపర్ బజార్, మధురవాడ కార్యాలయాలు అత్యధిక ఆదాయం సాధించగా.. అనందపురం, భీమునిపట్నం కార్యాలయాలు తక్కువ ఆదాయంతో చివర్లో నిలిచాయి.