చీరాలలో 9న ప్రజా ఫిర్యాదుల వేదిక
బాపట్ల: జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 9న చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్జీలు స్వీకరిస్తారు. అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 1100కు కాల్ చేయవచ్చు.