ఖేల్ ఇండియా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులు
PDPL: ఖేలో ఇండియా రాష్ట్రీయ వుషు ఛాంపియన్షిప్ పోటీల్లో గోదావరిఖనికి చెందిన విద్యార్థులు జిల్లా తరఫున పాల్గొన్నారు. అండర్ 17– 60 కేజీల విభాగంలో సిగిరి శ్రావ్యంజలి బంగారు, అండర్ 12 -25 కేజీల విభాగంలో యాసర్ల అరుషి వెండి, అండర్ 14 - 45 కేజీల విభాగంలో బూడిద ఉధంతిక కాంస్య పతకాలు సాధించారు. వీరిని పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ అభినందించారు.