'తొర్రూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'తొర్రూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MHBD: మొంథా తుఫాన్ తీవ్రత దృష్ట్యా తొర్రూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండుకుండలా నిండి ఉన్నాయని, ఏ క్షణమైనా పొంగిపోర్లే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు ఎవరు కూడా చెరువు మత్తడి, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, రోడ్డుపై వెళ్లేటప్పుడు గుంతలను గమనించి వెళ్లాలని కోరారు.