రేపు డంపింగ్ యార్డ్ సమస్యపై అఖిలపక్ష సమావేశం

HNK: వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని మడికొండ గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో రేపు ఆదివారం మడికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాంపురం, మడికొండ గ్రామాలకు చెందిన గ్రామస్తులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.