ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
RR: చేవెళ్ల మున్సిపాలిటీ 3వ వార్డు (దేవుని ఎర్రవల్లి)లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు గూడు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.