కొత్తపల్లిలో రేపు రక్తదాన శిబిరం

కొత్తపల్లిలో రేపు రక్తదాన శిబిరం

E.G: గోకవరం మండలం కొత్తపల్లిలో మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారా అజయ్ కుమార్ తెలిపారు. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కొత్తపల్లి అంబేద్కర్ యూత్ సహకారంతో ఉదయం 8 గంటల కు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.