VIDEO: 'అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి'
ప్రకాశం: అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం పెద్ద చర్లపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఈనెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న సందర్భంలో అక్కడ జరుగుతున్న ఏర్పాటులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎం ఈ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.