ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

PLD: గత రెండు రోజులుగా పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సూచించారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటకుండా ఉండాలని, వర్షం పడే సమయంలో కరెంటు స్తంభాలను పట్టుకోవద్దని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలన్నారు.